
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో అఖండ-2 చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది. ఇది పూర్తికాక ముందే మరో సినిమాకి ఓకే చెప్పేశారు. బాలకృష్ణ తన 111వ సినిమాని గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో చేయబోతున్నట్లు వృద్ధి సినిమాస్ నేడు సోషల్ మీడియాలో ప్రకటించింది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమా నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు తెలియజేస్తామని వెంకట్ చెప్పారు.
చిరంజీవి, ప్రభాస్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి పెద్ద హీరోలు రెండు మూడేళ్ళకు ఓ సినిమా చేస్తుంటే ఈ వయసులో కూడా నందమూరి బాలకృష్ణ ఏడాదికి కనీసం రెండు సినిమాలు చేస్తూ డిస్ట్రిబ్యూటర్లకు, సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి ఓనర్లకు ఎంతగానో మేలు చేస్తున్నారు.