
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న ఓజీ సినిమా షూటింగ్ పూర్తయిందని అ సినీ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ప్యాకప్ ఫర్ గంభీరా.. గేరప్ ఫర్ రిలీజ్ అంటూ చేతికి రక్తం మరకలతో ఉన్న పవన్ కళ్యాణ్ పోస్టర్ ఒకటి పెట్టింది.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు.
నాలుగేళ్ళ క్రితం మొదలుపెట్టిన క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో మొదలుపెట్టిన హరిహర వీరమల్లు జూన్ 12న విడుదల కావలసి ఉండగా మళ్ళీ వాయిదా పడింది. అందుకు తీవ్ర అసహనంతో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు సెప్టెంబర్ 25న ఓజీ వస్తోందనే ఏఎ వార్త తప్పక ఉపశమనం కలిగిస్తుంది.
PACKUP for GAMBHEERA…
GEAR UP for the RELEASE…
See you in theatres on 25 September 2025. #OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/uGucg8BGgo