టబు రీ ఎంట్రీ..!

టాలీవుడ్ హాట్ బ్యూటీ టబు తన అందంతో ప్రేక్షకులను వెర్రి వాళ్లను చేసింది. తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించిన ఈ భామ బాలీవుడ్ బాట పట్టి అక్కడ సూపర్ ఇమేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ లో నాగార్జునతో మంచి సత్సంబంధాలున్న టబు టాలీవుడ్లో అప్పుడప్పుడు తళుకున్న మెరుస్తుంది. ఇక ఈ క్రమంలో టబు మరోసారి తెలుగు సినిమాలో కనిపించబోతుందని టాక్. అఖిల్ సెకండ్ మూవీలో టబు ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందట.

2008లో ఇదీసంగతి సినిమా చేసిన టబు అదే సంవత్సరం బాలకృష్ణ పాండురంగడు సినిమాలో నటించింది. ఇక ఆ తర్వాత తెలుగు సినిమాలో కనిపించని టబు మళ్లీ 8 ఏళ్ల తర్వాత టాలీవుడ్ స్క్రీన్ పై మెరవనుంది. విక్రం కె కుమార్ డైరక్షన్లో అఖిల్ చేస్తున్న ఈ సినిమాలో అఖిల్ తల్లి పాత్రల్లో టబు నటిస్తుందని టాక్. సినిమాలో అనుకున్న రోల్ కు ఆమె పర్ఫెక్ట్ అనుకోవడంతో నాగార్జున టబుని ఒప్పించాడని తెలుస్తుంది. ఆ రోల్ క్లిక్ అయితే మళ్లీ టబు తెలుగు తెర మీద మళ్ళీ తన హవా కొనసాగిస్తుంది అని చెప్పొచ్చు.