రేపు అఖండ తాండవమేనట!

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న అఖండ-2 నుంచి ఓ అప్‌డేట్‌ వచ్చింది. ఆదివారం ఉదయం 10.54 గంటలకు తాండవం మొదలవుతుందని 14 రీల్స్ ప్లస్ ఎక్స్‌ వేదికగా తెలియజేసింది. అఖండ-2ని సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించినందున రేపు టీజర్‌ లేదా పాట విడుదల చేస్తారేమో? 

అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్‌ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.   

సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో అఖండ-2 నిర్మిస్తున్నారు.