అల్లు అర్జున్‌కి జోడీగా దీపికా పడుకొనే ఫిక్స్

అల్లు అర్జున్‌-అట్లీ కాంబినేషన్‌లో తీయబోతున్న భారీ యాక్షన్ మూవీలో బాలీవుడ్‌ బ్యూటీ ‘దీపికా పడుకొనే’ని ఖాయం చేశారు. ఈవిషయం తెలియజేస్తూ అట్లీ ఆమెకి ఈ సినిమా కధ చెపుతున్నప్పుడు తీసిన ఓ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

ఇది అల్లు అర్జున్‌కి 26వ సినిమా కాగా, అట్లీకి 6 వ సినిమా కనుక ఏఏ 26X ఏ6 అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమాని ప్రారంభిస్తున్నారు. రెండు సమాంతర ప్రపంచాలు, పునర్జన్మల నేపధ్యంతో ఏఎ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

దీని కోసం అల్లు అర్జున్‌, అట్లీ ఇటీవలే అమెరికా వెళ్ళి అక్కడ హాలీవుడ్ సినిమాలకు వీఎఫ్ఎక్స్ వర్క్స్ చేసే ఓ ప్రముఖ సంస్థతో మాట్లాడుకొని వచ్చారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని సుమారు రూ.700-1000 కోట్లు బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలోనే తీయబోతున్నారు. ఈ ఏడాది ఆగస్ట్ లేదా సెప్టెంబర్‌ నుంచి షూటింగ్‌ మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.