వీరమల్లు మళ్ళీ వాయిదా...

పవన్ కళ్యాణ్‌ ప్రధాన పాత్రలో హరిహర వీరమల్లు జూన్ 12న కావలసి ఉండగా అనివార్య కారణాల వలన వాయిదా వేయక తప్పలేదని వీరమల్లు టీమ్‌ సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు తెలియజేసింది.

ఈ సినిమాకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు తాత్కాలికంగా ఇది కాస్త నిరాశ కలిగించినా ఓ అద్భుతమైన అనుభూతి పొందేందుకు కాస్త ఓపిక పట్టడాని చిత్ర బృందం తెలిపింది. సీజీ వర్క్స్ పూర్తికాకపోవడం వలన సినిమా వాయిదా పడిందని త్వరలోనే రిలీజ్‌ డేట్ ప్రకటిస్తామని తెలిపింది. అంతవరకు సోషల్ మీడియాలో వచ్చే ఊహాగానాలను దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. 

వీరమల్లు వస్తుంటే థియేటర్స్ బంద్ చేస్తారా? అంటూ పవన్ కళ్యాణ్‌, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సినీ పరిశ్రమపై కన్నెర్ర చేశారు. దాంతో సినిమా థియేటర్స్ తెరిచి ఉంచినా చెప్పిన సమయానికి హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌ చేయలేకపోవడంతో ఇప్పుడు వారే నవ్వులపాలయ్యారు.