విజయ్ సేతుపతి-పూరీ సినిమా టైటిల్‌ మారిందా?

టాలీవుడ్‌ దర్శకుడు పూరీ జగన్నాధ్, కోలీవుడ్‌ నటుడు విజయ్ సేతుపతి కలిసి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి మొదట ‘బెగ్గర్’ అనే పేరు ఖరారు చేసినప్పటికీ దానిపై విమర్శలు వెల్లువెత్తడంతో దానిని మార్చి ‘భవతి భిక్షాం దేహి’గా మార్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా ప్రకటించిన వెంటనే ఈ సోషల్ మీడియాలో బిచ్చగాడి వేషం చేతిలో బొచ్చె పట్టుకొని ఉన్న విజయ్ సేతుపతి పోస్టర్ ఒకటి వచ్చింది. కనుక బహుశః టైటిల్‌ ఇదే కావచ్చు.

ఈ జూన్ నెల్లోనే షూటింగ్‌ ప్రారంభించబోతున్నామని పూరీ జగన్నాధ్ ఇదివరకే చెప్పారు. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవగానే త్వరలో షూటింగ్‌ ప్రారంభించేందుకు సిద్దమవుతున్నారు.

ఈ సినిమాలో టబు, రాధిక ఆప్టేలు ముఖ్య పాత్రలు చేయబోతున్నారు. ఈ సినిమాని పూరీ, ఛార్మీల సొంత బ్యానర్ ‘పూరీ కనెక్ట్స్’తో 5 భాషలలో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు.

విజయ్ దేవరకొండతో ‘లైగర్’ పాన్‌ ఇండియా మూవీగా తీసి పూరీ, ఛార్మీలు ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోయారు. మళ్ళీ కొలుకొని ఇప్పుడు ఈ సినిమాకి ‘బెగ్గర్’ లేదా ‘భవతి భిక్షాం దేహి’ అని టైటిల్‌ పెట్టుకోవడం నిజమైతే ముందే అపశకునం అన్నట్లనిపిస్తుంది.