అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి శ్రీవిష్ణు సింగిల్

కార్తీక రాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్, కేతిక శర్మ, ఇవాన ప్రధాన పాత్రలలో #సింగిల్ సినిమా మే 9న థియేటర్లలో విడుదలై ప్రేక్షకులని అలరించింది. పూర్తిగా నెల రోజులు కాక ముందే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలోకి వచ్చేసింది. నేటి నుంచే అమెజాన్ ప్రైమ్‌లో ఈ సినిమా ప్రసారం అవుతోంది. 

ఈ సినిమాలో శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరూ కామెడీ, వారి టైమింగ్ అద్భుతంగా ఉంది. ఇదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ. కానీ దీనిని ఆ కోణంలో కాకుండా కామెడీ టచ్ ఇస్తూ తెరకెక్కించడంతో అందరినీ మెప్పించింది.  

గీతా ఆర్ట్స్, కాల్య ఫిలిమ్స్ బ్యానర్లపై విద్యా కొప్పయినిధి, భాను ప్రతాప్, రియాజ్ చౌదరి కలిసి నిర్మించిన ఈ సినిమాకి కధ, దర్శకత్వం: కార్తీక రాజు, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: ఆర్‌. వేల్ రాజ్, డైలాగ్స్: భాను భోగవరపు, నందు సవిరిగన, ఆర్ట్: చంద్రిక గొర్రిపాటి, ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు.