
అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఓ ఇంటివాడయ్యాడు. హైదరాబాద్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం తెల్లవారుజామున తాను ప్రేమించిన జైనాబ్ రవ్జీని పెళ్ళి చేసుకున్నాడు. సినీ పరిశ్రమ నుంచి చిరంజీవి, శర్వానంద్, ప్రశాంత్ నీల్, రాజమౌళి కుమారుడు కార్తికేయ, సుమంత్, తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ నెల 8న అన్నపూర్ణా స్టూడియోస్ రెసిప్షన్‌కి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు కానున్నారు.
అఖిల్-జీనాబ్ వివాహ నిశ్చితార్ధం గత ఏడాది నవంబర్‌లో జరిగింది. కానీ డిసెంబర్‌లో నాగ చైతన్య-శోభితా ధూళిపాళ వివాహం ఉన్నందున అఖిల్-జీనాబ్ వివాహం వాయిదా వేసి ఇప్పుడు జరిపించారు. జైనాబ్ ఓ చిత్రకారిణి. హైదరాబాద్‌లో పెయింటింగ్ ఎగ్జబిషన్స్ నిర్వహిస్తుంటారు. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ సినీ నిర్మాణ రంగంలో ఉన్నారు.
అక్కినేని నాగేశ్వర రావుతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి నటించిన మనం (2014)లో అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి ఏడు సినిమాలు చేశాడు. కానీ ఒక్కటి కూడా హిట్ అవకపోవడంతో కెరీర్‌లో వెనుకబడిపోయాడు. ఇప్పుడు పెళ్ళి చేసుకున్నాక సినిమాలు చేస్తాడా లేక సినీ నిర్మాణ రంగంలో ప్రవేశిస్తాడా? త్వరలో తెలుస్తుంది.