
సీనియర్ నటులకు ఉందని స్వేచ్చ కొత్తగా సినీ పరిశ్రమలో వచ్చినవారికి, ఒకటి రెండు సినిమాలు చేసిన వారికి ఉంటుంది. కనుక వారు ఎటువంటి ప్రయోగాలైనా చేయగలరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ వంటివారు ఒకప్పుడు తమ కెరీర్ ప్రారంభంలో అనేక ప్రయోగాలు చేసినవారే. ఇప్పుడు కుర్ర హీరోలు చేస్తున్నారు.
హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకన్న తేజా సజ్జా ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఓ సూపర్ యోధ పాత్రలో ‘మిరాయ్’ అనే సినిమా చేస్తున్నాడు. అది పూర్తికాక ముందే తమిళంలో ‘డిమొంటీ కాలనీ’ హర్రర్ వెబ్ సిరీస్ 1,2 చేసి మంచి పేరు సంపాదించుకున్న కోలీవుడ్ దర్శకుడు అజయ్ జ్ఞాన ముత్తు దర్శకత్వంలో ఆ సిరీస్లో మూడో భాగంలో నటించేందుకు తేజా సజ్జా అంగీకరించినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.