
ఏటా సంక్రాంతికి కనీసం రెండు మూడు పెద్ద సినిమాలుంటాయి. 2026 సంక్రాంతికి కూడా అప్పుడే అనేక సినిమాలు క్యూ కడుతున్నాయి. వాటిలో ముందుగా చెప్పుకోవలసింది మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడిల సినిమా. ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టి అప్పుడే మొదటి షెడ్యూల్ పూర్తి చేశారు. సంక్రాంతికి రిలీజ్ అని అనిల్ రావిపూడి ముందే చెప్పేశారు.
రవితేజ-కిషోర్ తిరుమల సినిమాకి ఇవాళ్లే పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాని ఈ ఏడాది డిసెంబర్ 25 లేదా సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నవీన్ పోలిశెట్టి సినిమా ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14కి ఫిక్స్ చేసుకున్నారు. కోలీవుడ్ హీరో విజయ్ చేస్తున్న ‘జన నాయగన్’ తెలుగు వెర్షన్ కూడా జనవరిలో సంక్రాంతి పండుగకే రాబోతోంది. బాలకృష్ణ-బోయపాటి అఖండ-2 ఈ ఏడాది దసరాకి వస్తామని చెప్పినప్పటికీ ఆలస్యమైతే సంక్రాంతికి వచ్చే అవకాశం ఉంది.
ఇంకా ప్రశాంత్ ప్రశాంత్ వర్మ, నాని, శ్రీవిష్ణు, సుహాస్, శర్వానంద్, సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, అడవి శేష్ తదితరుల సినిమాలలో కొన్ని సంక్రాంతిలో బరిలో దిగినా దిగవచ్చు. కనుక వచ్చే సంక్రాంతి సినీ అభిమానులకు మరో పండగే అవుతుంది.