
ఒకప్పుడు టాలీవుడ్‌ని చాలా చులకనగా చూసే బాలీవుడ్, ఇప్పుడు తెలుగు, తమిళ్ సినీ దర్శకులతో, నటీనటులతో కలిసి సినిమాలు చేయడానికి చాలా తహతహలాడుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్లో సీనియర్ నటుడు సన్నీ డియోల్, రణదీప్ హుడా నటించిన ‘జాట్’ పక్కా కమర్షియల్ సినిమా అయినప్పటికీ, అది ఉత్తరాది ప్రజలకు కొత్తగా అనిపించడంతో సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో జగపతి బాబు, రమ్యకృష్ణ కూడాముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమా నేటి నుంచే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రసారం అవుతోంది. తెలుగు ప్రేక్షకులు ఇటువంటి మాస్ మసాలా సినిమాలు చాలా చూసి ఉన్నందున, తెలుగులో డబ్బింగ్ కూడా చక్కగా కుదరడం, ఏపీలో మోటుపల్లి గ్రామంలో ఈ సినిమా కధ సాగడం వలన, తెలుగు ప్రేక్షకులు దీనిని హిందీ సినిమా అనుకోకుండా చూసి ఆనందిస్తున్నారు.