రవితేజ కొత్త సినిమాకి రేపే కొబ్బరికాయ

మాస్ మహారాజ్‌ రవితేజ కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టబోతున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమాకు గురువారం ఉదయం 9.02 గంటలకు హైదరాబాద్‌లో కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తూ ఎస్‌ఎల్‌వీ సినిమాస్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీని కోసం పెట్టిన పోస్టర్ చాలా అద్భుతంగా ఉంది. 

సూటుబూటులో హీరో రవితేజ విమానాశ్రయంలో స్టయిల్‌గా నిలబడి విమానాలా రాకపోకలని తెలియజేసే డిజిటల్ బోర్డ్ చూస్తున్నట్లు పోస్టర్ వేశారు. దానిలో “అప్‌డేట్‌: ఆర్‌టి 76: సమయం 9.02 గంటలు.. ఆన్‌టైమ్” అని చూపడం అందరినీ ఆకట్టుకుంటుంది. 

ఈ సినిమాలో హీరోయిన్లుగా కేతికా శర్మ, ఆషికా రంగనాధ్ పేర్లు ఖరారు చేసినట్లు తాజా సమాచారం. రేపు పూజా కార్యక్రమం తర్వాత వారి పేర్లు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.