వీరమల్లు మళ్ళీ వాయిదా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 12న విడుదల కాబోతుండటంతో 8 వ తేదీన తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ జరుపబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే వీఎఫ్ఎక్స్‌ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో సినిమా వాయిదా పడినట్లు తెలుస్తోంది.

అందువల్లే ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా రద్దు చేసుకునట్లు తెలుస్తోంది. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్‌ వాయిదా పడిందనే వార్త మీడియాలో వస్తున్నప్పటికీ ఇంతవరకు దర్శక నిర్మాతలు కానీ చిత్ర బృందం గానీ ఈ వార్తలను ఖండించలేదు. ధృవీకరించలేదు. వారి మౌనం కూడా సినిమా వాయిదా పడిందని సూచిస్తున్నట్లే ఉంది. 

క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మొదలుపెట్టి అది ఎంతకూ పూర్తికాకపోవడంతో క్రిష్ తప్పుకోగా ఆయన స్థానంలో జ్యోతీకృష్ణ పూర్తి చేస్తున్నారు. ఇటీవలే పవన్ కళ్యాణ్‌ డబ్బింగ్ వర్క్ పూర్తిచేయడంతో ఇక సినిమా వచ్చేసినట్లే అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడిందనే వార్త అభిమనులను కలవరపరుస్తోంది.    

తాజా సమాచారం ప్రకారం హరిహర వీరమల్లు వచ్చే నెల 5 లేదా 12 వ తేదీలలో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.