మాస్ మహారాజ్‌కి రెండో హీరోయిన్ ఫిక్స్

మాస్ మహారాజ్‌ రవితేజ ప్రస్తుతం ‘మాస్ జాతర’ పూర్తిచేస్తున్నారు. దీని తర్వాత కిషోర్ తిరుమల దర్శకత్వంలో మరో సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. ఇప్పటికే కేతికా శర్మని మొదటి హీరోయిన్‌గా ఖరారు చేశారు. ఇప్పుడు రెండో హీరోయిన్‌గా ఆషికా రంగనాధ్ పేరు ఖరారు చేసినట్లు తాజా సమాచారం. 

ఆషికా రంగనాథ్ ‘నా సామి రంగా’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న విశ్వంభరలో ఛాన్స్ దక్కించుకుంది. సినిమాల మద్య  కాస్త గ్యాప్ ఎక్కువే ఉంటునప్పటికీ పెద్ద హీరోల సినిమాలలో అవకాశాలు దక్కించుకుంటుంటోంది. రవితేజకి జోడీగా అవకాశం లభించి, ఆ సినిమా హిట్ అయితే ఇక ఆమె తిరిగి చూసుకోనవసరం ఉండకపోవచ్చు. 

సినీ రచయిత భాను భోగవరపు దర్శకత్వంలో రవితేజ చేస్తున్న ‘మాస్ జాతర’లో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా చేస్తోంది.  ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మిస్తున్నారు.