కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఫస్ట్ గ్లింమ్స్‌

కిరణ్ అబ్బవరం తాజా సినిమా పేరు ‘చెన్నై లవ్ స్టోరీ’ అని ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ గ్లింమ్స్‌ సోమవారం విడుదలైంది. తొలిప్రేమ విఫలమైన యువతితో ప్రేమలో పడ్డ హీరో చెన్నై బీచ్ ఒడ్డున కూర్చొని తొలిప్రేమ గురించి వారిద్దరి మద్య సంభాషణ ఫస్ట్ గ్లింమ్స్‌లో చూపారు. డైలాగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీ గౌరీ ప్రియ నటిస్తోంది.  

రవికుమార్ నంబూరి స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకి సాయి రాజేష్ కధ అందించి మాస్ మూవీ మేకర్స్, అమృత ప్రొడక్షన్ బ్యానర్లపై సాయి రాజేష్, ఎస్‌కెఎన్‌, ధీరజ్ మొగిలినేని కలిసి నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంగీతం: మణిశర్మ, కెమెరా: విశ్వాస డేనియల్. త్వరలోనే ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు వెలువడతాయి.