
టాలీవుడ్ యువహీరో నిఖిల్ కార్తికేయ1,2 లతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న తర్వాత ప్రతీ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే చేస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో సోషియో ఫాంటసీ సినిమా స్వయంభూ షూటింగ్ దాదాపు పూర్తయింది. నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా ఇవాళ్ళ స్వయంభూ నుంచి ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ సినిమాలో నిఖిల్ ఓ యోధుడుగా నటిస్తున్నాడు. అతనికి జోడీగా నభా నటేష్ నటిస్తోంది. ఆమె కూడా యోధురాలుగా నటిస్తున్నారు. స్వయంభూలో సంయుక్త మీనన్ రెండో హీరోయిన్‌తో నటిస్తోంది.
ఈ సినిమాకి సంగీతం: రవి బస్రూర్, కెమెరా: మనోజ్ పరమహంస, డైలాగ్స్: వాసుదేవ్ మున్నెప్పగారి చేస్తున్నారు. టాగూర్ మధు, భువన్, శ్రీకర్ కలిసి పిక్సల్ స్టూడియోస్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా స్వయంభూ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతోంది.