శ్రీశ్రీశ్రీ రాజావారు ట్రైలర్‌.. మూడేళ్ళు ఆలస్యం

జూ.ఎన్టీఆర్‌ బావమరిది నార్నె నితిన్‌ మూడేళ్ళ క్రితం మొదలుపెట్టిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ సినిమాకు ఎట్టకేలకు మోక్షం లభించింది. శనివారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసి జూన్ 6న  సినిమా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు.  

ఈ సినిమా తర్వాత నార్నె నితిన్‌ మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్, ఆయ్ మూడు సినిమాలు పూర్తిచేశారు. అవప్పుడే విడుదలై ఓటీటీలోకి వెళ్ళిపోయాయి కూడా. వాటి కంటే చాలా కాలం ముందు మొదలుపెట్టిన ఈ సినిమా ఇప్పుడు వస్తోంది. 

శమానం భవతి వంటి సూపర్ హిట్ సినిమా అందించిన సతీష్ వెగ్నేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించినందున      కనుక ఇది కూడా హిట్ అయితే నార్నె నితిన్‌ కెరీర్‌లో ఇక దూసుకుపోవచ్చు.

 ఈ సినిమాలో నార్నె నితిన్‌కి జోడీగా సంపద నటించగా, రావు రమేష్, శుభలేఖ సుధాకర్, నరేష్ ముఖ్య పాత్ర చేశారు. 

ఈ సినిమాకు కెమెరా: దాము నరవుల, ఎడిటింగ్: మధు చేశారు. శ్రీ వేదాక్షారా మూవీస్ బ్యానర్‌పై చింతపల్లి రామారావు, రాజీవ్ కుమార్‌ రాజమౌళి-మహేష్ బాబు, సిహెచ్ వి శర్మ కలిసి నిర్మించారు.