
భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ మహరాజ్ రవితేజ హీరోగా చేస్తున్న ‘మాస్ జాతర’ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించేశారు. ఈ సినిమా ఆగస్ట్ 27న వినాయక చవితి సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమాలో డాన్సింగ్ క్వీన్ శ్రీలీల రవితేజకు జోడీగా నటిస్తోంది. ఇదివరకు వారిరువురూ చేసిన ‘ధమాకా’ సూపర్ హిట్ అయ్యింది. కనుక మళ్ళీ వారి కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ముఖ్యంగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజకు ఈ ఏడాది పండుగ సీజను ప్రారంభంలో విడుదలవుతున్న ఈ పక్కా కమర్షియల్ ‘మాస్ జాతర’ హిట్ అవడం చాలా అవసరం. లేకుంటే కిషోర్ తిరుమల దర్శకత్వంలో తర్వాత చేయబోయే సినిమాపై పడే ప్రమాదం ఉంటుంది.
ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: కార్తీక్ ఘట్టమనేని, డైలాగ్స్: ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.
శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ సినిమాస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య కలిసి మాస్ జాతర నిర్మిస్తున్నారు.
మాస్ జాతర పూర్తి చేసిన వెంటనే రవితేజ-కిషోర్ తిరుమల కలిసి సినిమా మొదలుపెట్టబోతున్నారు. ఈ సినిమా 2026 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు.