
‘హరిహర వీరమల్లు’ జూన్ 12న విడుదల కాబోతుండటంతో, పవన్ కళ్యాణ్ తన పాత్ర డబ్బింగ్ వర్క్ నిన్న పూర్తి చేశారు. బుధవారం రాత్రి 10 గంటల నుంచి ఏకధాటిగా 4 గంటల సేపు డబ్బింగ్ చెప్పారని దర్శకుడు జ్యోతి కృష్ణ తెలియజేస్తూ ఓ ఫోటో కూడా విడుదల చేశారు.
పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా క్షణం తీరికలేని జీవితం గడుపుతున్నప్పటికీ, తన వలన సినిమా ఇంకా ఆలస్యం కాకూడదని రాత్రంతా కూర్చొని డబ్బింగ్ పని పూర్తి చేయడం అభినందనీయమే. దీంతో జూన్ 12న హరిహర వీరమల్లు విడుదలకు పూర్తిగా లైన్ క్లియర్ అయిపోయినట్లే కనుక పవర్ స్టార్మ్ కు అందరూ సిద్దంగా ఉండంది జూన్ 12 న మీ ఉత్తేజం ఊరకాలేస్తుంది, “ అంటూ చిత్ర బృందం ట్వీట్ చేసింది.
హరిహర వీరమల్లులో బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, దక్షిణాది నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
హరిహర వీరమల్లుని క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టగా జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన హరిహర వీరమల్లు జూన్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.