
జయసుధ నేతృత్వంలో ఏర్పాటైన జ్యూరీ నేడు గద్దర్ అవార్డులు ప్రకటించింది. ఉత్తమ చిత్రంగా కల్కి 2898, ఉత్తమ నటుడుగా అల్లు అర్జున్‌ని జ్యూరీ ఎంపిక చేసింది.
ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్‌రాజుతో కలిసి జయసుధ మీడియా సమావేశం ఏర్పాటు చేసి గద్దర్ అవార్డులను ప్రకటించారు.
సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వం నంది అవార్డులు ఇస్తుండేది. కానీ తెలంగాణ ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్నందున 2011 నుంచి నంది అవార్డుల ప్రధానోత్సవం నిలిచిపోయింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి మళ్ళీ ఇంతవరకు అవార్డులు ఇవ్వలేదు. కనుక దాదాపు 14 ఏళ్ళ తర్వాత మళ్ళీ గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరుగుతోందని చెప్పారు. వీటి కోసం మొత్తం 1248 నామినేషన్స్ వచ్చాయని తెలిపారు. వాటిలో ఎంపికనవారు, సినిమాల వివరాలు..
2024 బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 1. కల్కి 2898, 2. పొట్టేల్, 3. లక్కీ భాస్కర్.
ఉత్తమ నటీనటులు:
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ నటి: నివేదా ధామస్ (35 ఇది చిన్న కధ కాదు)
ఉత్తమ సహాయ నటుడు: ఎస్‌జె సూర్య (సరిపోదా శనివారం)
ఉత్తమ సహాయ నటి: శరణ్య ప్రదీప్ (అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
ఉత్తమ హాస్య నటులు: సత్య, వెన్నెల కిషోర్ (మత్తు వదలరా-2)
ఉత్తమ బాలనటులు: మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక (35 ఇది చిన్న కధ కాదు)
ఉత్తమ దర్శకులు, గాయకులు:
ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి ఏడీ 2898)
ఉత్తమ సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో (రాజాకార్)
ఉత్తమ నేపధ్య గాయకుడు: సిద్ శ్రీరామ్ (ఊరి పేరు భైరవకోన)
ఉత్తమ నేపధ్య గాయని: శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
ఉత్తమ కధా రచయిత: శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత: వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ గేయ రచయిత: చంద్రబోస్ (రాజు యాదవ్)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్: విశ్వనాధ్ రెడ్డి (గామి).