
మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న కన్నప్ప సినిమా నుంచి మంగళవారం శ్రీకాళహస్తీ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ ప్రమో విడుదల చేశారు. దీని ప్రత్యేకత ఏమిటంటే, మంచు విష్ణు ఇద్దరు కుమార్తెలు అరియాన, వివియాన ఈ పాటలో డాన్స్ చేశారు. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. చక్కగా డాన్స్ చేశారు. సుద్దాల అశోక్ తేజ వ్రాసిన ఈ పాటని వారిరువురే చాలా చక్కగా పాడారు కూడా. ఈ పూర్తి పాట రేపు (బుధవారం) విడుదల కాబోతోంది. ఈ పాటకు సంగీతం స్టీఫెన్ దేవాస్సీ అందించారు.
మహాభారత్ హిందీ సీరియల్‌కు దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ కన్నప్ప సినిమాకు దర్శకత్వం చేస్తున్నారు. కన్నప్పలో మంచు విష్ణుకి జోడీగా బాలీవుడ్ నటి నుపూర్ సనన్ నటిస్తోంది. శివపార్వతులుగా బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, రుద్రుడుగా ప్రభాస్ నటించారు. మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, మోహన్ లాల్, అర్పిత రాంక, సప్తగిరి, ముఖేష్ ఋషి, మధుబాల, ఐశ్వర్య భాస్కరం, బ్రహ్మాజీ, దేవరాజ్, రఘుబాబు, శివ బాలాజీ, సంపత్ రామ్ చరణ్, లావి పజ్నీ , సురేకహహ వాణీ, ముకుందన్ , అదుర్స్ రఘు ముఖ్యపాత్రలు చేశారు.
కన్నప్ప సినిమాకు సంగీతం: స్టీఫెన్ దేవాస్సీ, కెమెరా: షెల్డన్ షావ్, ఆర్ట్ డైరెక్టర్: చిన్న, స్టంట్స్: కెచ్చా కంఫక్డే, కొరియోగ్రఫీ: ప్రభుదేవ, బృంద, గణేష్, ఎడిటింగ్: ఆంథోనీ గోన్ సాల్వే, చేశారు.
ఈ సినిమాను అవా ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన కన్నప్ప జూన్ 27న విడుదల కాబోతోంది.