అహాలో బెట్టింగ్ బోగిగాడు..

ప్రముఖ తెలుగు ఓటీటీ అహాలో త్రీ రోజస్ సీజన్ 1 సూపర్ హిట్ అవడంతో దానికి కొనసాగింపుగా త్రీ రోజస్ సీజన్ 2 తీసి వదిలారు. దానిలో బెట్టింగ్ బోగిగా సత్య చేసిన కామెడీ చూసి తీరాల్సిందే. ఈ వెబ్ సిరీస్‌లో ఈషా రెబ్బా, వైవా హర్ష, కుష్టిత కల్లపు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

ఈ వెబ్ సిరీస్‌లో బెట్టింగ్ బోగిని పరిచయం చేస్తూ అద్భుతమైన కామెడీతో నేడు ఓ వీడియో విడుదల చేశారు. 

రవి నంబూరి, సందీప్ బొల్ల కలిసి వ్రాసిన కధని కిరణ్ కె కరవల్ల దర్శకత్వంలో వెబ్ సిరీస్‌గా తీశారు. దీనికి సంగీతం: అజయ్ అరసాడ, కెమెరా: శక్తి అరవింద్, ఎడిటింగ్: విజయ్ దేవరకొండ ముక్తవరపు, ఆర్ట్: భాస్కర్ ముదావత్ చేశారు.