
పవన్ కళ్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ జూన్ 12న వచ్చేస్తోంది. తాజాగా ఆయన చేస్తున్న మరో సినిమా ‘ఓజీ’కి కూడా రిలీజ్ డేట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో తీస్తున్న ఈ యాక్షన్ ప్యాక్ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల చేయబోతున్నట్లు డీవీవీ ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియాలో ప్రకటించింది.
ముంబయి అండర్ వరల్డ్ గ్యాంగుల మద్య ఘర్షణల నేపధ్యంతో సుజీత్ ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పూర్తయింయి. పవన్ కళ్యాణ్ మళ్ళీ షూటింగ్ కోసం సమయం కేటాయించి మిగిలిన 20 శాతం కూడా పూర్తి చేస్తున్నారు. కనుక సెప్టెంబర్ 25న విడుదల చేస్తామని డేట్ ప్రకటించేసింది.
డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఓజీకి తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు, నేపద్య గాయకుడు రమణ గోగుల ఒకవేళ అంగీకరిస్తే ఆయన చేత ఈ సినిమాలో ఓ పాట పాడించాలనుకుంటున్నానని ధమన్ చెప్పారు.
ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా నటిస్తున్నారు. శుభలేఖ సుధాకర్, ప్రకాష్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, హరీష్ శంకర్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకి కధ, దర్శకత్వం: సుజీత్, సంగీతం: థమన్; కెమెరా: రవి కె చంద్రన్; ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా డీవీవీ దానయ్య దీనిని నిర్మిస్తున్నారు.
FIRING WORLDWIDE in cinemas on
25th September 2025… 💥💥💥💥
#OGonSept25#TheyCallHimOG #OG pic.twitter.com/DQAOFOrQxx