
హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన తేజ సజ్జా, దాని తర్వాత ఘట్టమనేని కార్తీక్ దర్శకత్వంలో ‘మిరాయ్’ చేస్తున్నాడు. దీనిలో కూడా తేజా సజా అతీతశక్తులు కలిగిన సూపర్ యోధుడుగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో తేజ సజ్జకు జోడీగా రీతికా నాయక్, విలన్ గా మంచు మనోజ్ నటిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఫస్ట్ గ్లిమ్స్‌లో అలనాటి కళింగుల కాలంలో అశోక చక్రవర్తి చేసిన ఓ మహాయుద్ధంలో జరిగిన మారణ కాండ, ఆ తర్వాత మనిషికి దైవత్వం ప్రాప్తింప జేసే ఓ గ్రంధం, దానిని కాపాడేందుకు తొమ్మిది మంది యోధులు, తస్కరించేందుకు జరిగే ప్రయత్నాల నేపధ్యంతో దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ కధని అల్లుకున్నారు.
ఈ సినిమా టీజర్ బుధవారం విడుదల చేయబోతున్నట్లు తెలియజేస్తూ వేగంగా దూసుకుపోతున్న ఓ రైలుబండిపై తేజా సజ్జా ఫైట్ చేస్తున్న ఓ పోస్టర్ విడుదల చేశారు.
ఈ సినిమాని తెలుగు, తమిళ్, కన్నడం మలయాళం, బెంగాలీ, మరాఠీ, చైనీస్ భాషల్లో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాని 2డి, 3డి ఫార్మాట్లో నిర్మించి ఈ ఏడాది ఆగస్ట్ 1న విడుదల చేయబోతున్నట్లు ఇటీవలే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రకటించింది.