
శంకర్ చేగూరి దర్శకత్వంలో మహేష్ చింతల, విద్యాసాగర్ రావు, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రలలో ‘బద్మాషులు’ సినిమా జూన్ 6 న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి జిందగీ బిలాలే..అనే పాటని నటుడు ప్రియదర్శి నేడు హైదరాబాద్‌లో విడుదల చేశారు.
దర్శకుడు శంకర్ చేగూరి వ్రాసిన ఈ పాటకి తేజ కూనూరు సంగీతం అందించగా చరణ్ అర్జున్, వీహ కలిసి హుషారుగా పాడారు.
ఈ సినిమాలో కవిత శ్రీరంగం, దీక్ష కోటేశ్వర, అంజయ్య, సుధాకర్ రెడ్డి, గుండా మల్లయ్య తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: తేజ కునూరు, కొరియోగ్రఫీ: చార్లీ రఘురామ కృష్ణరాజు స్టార్, కెమెరా: వినీత్ పబ్బతి, ఎడిటింగ్: గజ్జల రక్షిత్ కుమార్, ఆర్ట్: మురళి ఇంద్రపల్లి చేశారు.
సితారా స్టోరీ టెల్లర్స్ బ్యానర్‌పై బి బాలకృష్ణ, సి. రామశంకర్ కలిసి ఈ సినిమా నిర్మించారు.