
ప్రముఖ బాలీవుడ్ నటుడు ముకుల్ దేవ్ (54) శుక్రవారం రాత్రి ముంబయిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కన్నుమూశారు. ఆయన ఆకస్మిక మృతికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది. ముకుల్ దేవ్ తెలుగులో రవితేజ సినిమా ‘కృష్ణ’లో విలన్‌గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత అదుర్స్, సిద్దం, మనీ మనీ మోర్ మనీ, నిప్పు, భాయ్ సినిమాలలో నటించారు.
పంజాబ్‌కు చెందిన ఆయన మొదట హిందీ, పంజాబీ టీవీ ఛానల్స్‌లో సీరియల్స్ లో నటించారు. ‘దస్తక్’ సినిమాతో బాలీవుడ్లో ప్రవేశించి అనేక హిందీ సినిమాలలో నటించారు. పంజాబీ, కన్నడ, తెలుగు సినిమాలలో కూడా నటించారు. ఆయన చివరిగా నటించిన సినిమా 2022లో విడుదలైన ‘అంత్: ది ఎండ్.’ ఆ తర్వాత సినిమాలలో నటించలేదు.
ముకుల్ దేవ్ మృతి పట్ల బాలీవుడ్, టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.