సందీప్ బ్యాడ్ స్పిరిట్: దీపికని అందుకే తీసేశారట!

సందీప్ రెడ్డి వ్యంగా దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తీయబోయే ‘స్పిరిట్’ సినిమాలో హీరోయిన్‌గా ప్రముఖ బాలీవుడ్‌ నటి దీపికా పడుకొనేని తీసుకున్నట్లు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. కానీ అకస్మాత్తుగా ఆమెని తన సినిమా నుంచి తొలగించాలని సందీప్ రెడ్డి వంగా నిర్ణయంపై అప్పుడే బాలీవుడ్‌లో విమర్శలు మొదలయ్యాయి. 

బాలీవుడ్‌లో ఆమె చాలా సీనియర్ నటి. అందరూ ప్రముఖ హీరోలతో కలిసి నటించారు. నేటికీ బాలీవుడ్‌లో ఆమెకు ఫుల్ డిమాండ్ ఉంది. ఆ స్థాయి నటి ‘స్పిరిట్’ సినిమాలో తన పని గంటలు, తెలుగు డైలాగులు, లాభాలలో వాటాని మార్చమని కోరారు.

వీలైతే అవసరమైన మార్పులు, చేర్పులు చేస్తారనుకుంటే ఆమెను తన సినిమా నుంచి తొలగించడం చాలా అన్యాయం, అవమానమని, ఇది చాలా బ్యాడ్ స్పిరిట్ అని బాలీవుడ్‌లో విమర్శలు వినిపిస్తున్నాయి. కానీ సందీప్ రెడ్డి వంగా స్వయంగా నోరు విప్పి మాట్లాడితే తప్ప వాస్తవం ఏమిటో తెలియదు. 

వచ్చే నెలాఖరులోగా ఈ సినిమా షూటింగ్‌ మొదలుపెట్టి, నవంబర్‌-డిసెంబర్‌లోగా ‘స్పిరిట్’విడుదల చేయాలనుకుంటున్నామని నిర్మాత భూషణ్ కుమార్ చెప్పారు.