ట్రాన్స్ ఆఫ్ కుబేర ఆదివారం విడుదల

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రలు చేసిన ‘కుబేర’ జూన్ 20న విడుదల కాబోతోంది. ట్రాన్స్ ఆఫ్ కుబేర (టీజర్) రేపు ఆదివారం విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ అందమైన పెయింటింగ్ వంటి చక్కటి పోస్టర్ విడుదల చేశారు. 

ఈ సినిమాలో నాగార్జున కోటీశ్వరుడుగా, ధనుష్ ఓ బిచ్చగాడిగా నటిస్తున్నారు. వారిద్దరితో రష్మిక పాత్రకి సంబంధం ఏమిటో రేపు టీజర్‌లో చెపుతారేమో?  

ఈ సినిమాలో ధనుష్, నాగార్జున, రష్మిక మందన, జిమ్ సరబ్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. కుబేరకి కధ: శేఖర్ కమ్ముల, చైతన్య పింగళి, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, సంగీతం: దేవి శ్రీప్రసాద్, కెమెరా: నికేత్ బొమ్మి చేస్తున్నారు. 

శ్రీ వేంకటేశ్వర సినిమాస్, ఎల్ఎల్పి అమిగోస్ క్రియెషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కుర్ రాంమోహన్ రావు కలిసి ఈ సినిమాని 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.