నెట్‌ఫ్లిక్స్‌లోకి హిట్-3 ఎప్పటినుంచంటే..

శైలేష్ కొలను దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని, శ్రీనిధి శెట్టి జంటగా చేసిన ‘హిట్-3’ సినిమా మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా ప్రముఖ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 29 నుంచి ప్రసారం కాబోతోంది. 

ఒకే రకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న హత్యలను పరిశోధించే ఐపీఎస్ అధికారి అర్జున్ ఠాకూర్‌గా నాని నటించి మెప్పించారు. ఈ సినిమాలో రావు రమేష్, బ్రహ్మాజీ, అడవి శేష్, సూర్య శ్రీనివాస్, ఆదిల్ పాల, మాగంటి శ్రీనాధ్ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకి కధ, దర్శకత్వం: శైలేష్ కొలను, సంగీతం: మిక్కీ జె మేయర్, కెమెరా: సను జాన్ వర్గీస్, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్ చేశారు.