మే 26న డెకాయిట్ ఫస్ట్ గ్లింమ్స్‌

అడవి శేష్, మృణాళినీ ఠాకూర్ జంటగా చేస్తున్న ‘డెకాయిట్-ఒక ప్రేమ కధ’ ఫస్ట్ గ్లింమ్స్‌ ఈ నెల 26న  ఉదయం 11.07 గంటలకు విడుదల కాబోతోంది. షనీల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ డ్రామా సినిమాని తెలుగు, హిందీ భాషలలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియా యార్లగడ్డ, సునీల్ నారంగ్ కలిసి నిర్మిస్తున్నారు.

అడవి శేష్, దర్శకుడు షనీల్ డియో ఇద్దరూ కలిసి ఈ కధ, స్క్రీన్ ప్లే చేశారు. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు, నటుడు అనురాగ్ కశ్యప్ ఓ ముఖ్య పాత్ర చేశారు.