పెద్ది కోసం హైదరాబాద్‌లో గ్రామం సెట్

రామ్ చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్‌లో ‘పెద్ది’ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. ఇది పీరియాడికల్ సినిమా కనుక దీని కోసం హైదరాబాద్‌లో ఓ గ్రామం సెట్స్‌ వేసి దానిలో షూటింగ్‌ చేస్తున్నారు. సినిమాలో చాలా వరకు ఈ సెట్స్‌లోనే షూటింగ్‌ జరుపబోతున్నారు. 

గత నెలలో విడుదల చేసిన ‘పెద్ది’ ఫస్ట్-లుక్‌ పోస్టర్, శ్రీరామ నవమి సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింమ్స్‌ చాలా వైరల్ అవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా, జగపతి బాబు, కన్నడ నటుడు శివరాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

పెద్ది సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు నిర్మాతగా ‘పెద్ది’ నిర్మిస్తున్నారు.