ఫౌజీ సెట్స్‌లోకి ప్రభాస్‌.. నేటి నుంచే

హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ (ఫౌజీ) ఓ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కేరళలో మొదటి షెడ్యూల్ పూర్తయింది. ప్రభాస్‌ విదేశాలకు వెళ్లడంతో మిగిలినవారితో కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. తర్వాత చిత్ర బృందం హైదరాబాద్‌ తిరిగి వచ్చి రామోజీ ఫిలిమ్ సిటీలో రెండో షెడ్యూల్ మొదలు పెట్టింది. ప్రభాస్‌ విదేశీ టూర్ ముగించుకొని తిరిగివచ్చి నేటి నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

ఈ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా కొత్త హీరోయిన్‌ ఇమాన్వీ నటిస్తుండగా, అలనాటి అందాల నటి జయప్రద, బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి ముఖ్యపాత్రలు చేయబోతున్నారు.  

మైత్రీ మూవీ మేకర్స్‌, టీ సిరీస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి సంగీత దర్శకత్వం: విశాల్ చంద్రశేఖర్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.