సంబంధిత వార్తలు

భారత దివంగత రాష్ట్రపతి డా. అబ్దుల్ కలాం జీవితగాధ ఆధారంగా ‘కలాం: ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే సినిమా తీయబోతున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో నిర్మించబోతున్న ఈ సినిమాలో డా. కలాంగా కోలీవుడ్ నటుడు ధనుష్ నటించబోతున్నారు. కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమా ప్రకటించి పోస్టర్ విడుదల చేశారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్, భూషణ్ కుమార్, కృషన్ కుమార్, అనిల్ సుంకర కలిసి నిర్మించబోతున్నారు. డా. కలాం ఆత్మకధ వింగ్స్ ఆఫ్ ఫైర్ ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారు. ఈ సినిమాకు సైవిన్ క్వాడ్రాస్ స్క్రీన్ ప్లే చేయబోతున్నారు.