కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ నుంచి షుగర్ బేబీ..

కమల్ హాసన్-మణిరత్నం- ఏఆర్‌ రెహమాన్ కాంబినేషన్‌లో జూన్ 5న ‘థగ్ లైఫ్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమా నుంచి షుగర్ బేబీ అంటూ సాగే పాటని బుధవారం విడుదల చేశారు. 

అనంత శ్రీరామ్ వ్రాసిన పాటకి ఏఆర్‌ రహమాన్ సంగీతం సమకూర్చగా అలగ్జాండ్ర జాయ్, శుభలేఖ సుధాకర్‌, నకుల అభయంకర్ కలిసి పాడారు.    

ఈ సినిమాలో కమల్ హాసన్‌కు జోడీగా త్రిష నటించారు. సిలాంబరసం టీఆర్, అశ్వర్య లక్ష్మీ, అశోక్ సెల్వన్‌, అభిరామ్, జోజు జార్జ్, నాసిర్, మహేష్ బాబు మంజ్రేకర్, ఆలీ ఫజల్ ముఖ్య పాత్రలు చేశారు. 

ఈ సినిమాకు కధ: మణిరత్నం, కమల్ హాసన్, సంగీతం:ఏఆర్‌ రెహమాన్, కెమెరా: రవి కె చంద్రన్, యాక్షన్: ఆన్‌భరివ్, కొరియోగ్రఫీ: కృతి మహేష్, ఏడిటింగళ శ్రీకర్ ప్రసాద్, పాటలు: అనంత్ శ్రీరామ్ చేశారు. 

రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్లపై పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/1N7Y1sL8fns?si=_swTSQn-MYdhGHlk" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>