
కోలీవుడ్ దర్శకుడు అట్లీ బుధవారం హైదరాబాద్ వచ్చారు. ఈరోజు ఉదయం ఆయన చెన్నై నుంచి విమానంలో శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్నారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా చేద్దామనుకున్నారు. కానీ హటాత్తుగా అట్లీతో తన 26వ సినిమా మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నారు. రేపు (గురువారం) దశమి మంచి రోజు. పైగా హనుమాన్ జయంతి కూడా.
కనుక రేపు వారిద్దరి సినిమాకి పూజా కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. దానిలో పాల్గొనేందుకు అట్లీ చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చి ఉండవచ్చు. అట్లీ ఏ హీరోతో సినిమా కమిట్ అయినా సాధ్యమైనంత వేగంగా మొదలుపెట్టి పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. కనుక రేపు పూజా కార్యక్రమం పూర్తవగానే జూన్ నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టే అవకాశం ఉంది.
గత నెల వారిద్దరూ కలిసి లాస్ ఏంజలెస్‌లో ప్రముఖ వీఎఫ్ఎక్స్ స్టూడియోకి వెళ్ళారు. అక్కడే వీఎఫ్ఎక్స్ కోసం అల్లు అర్జున్‌ని స్కానింగ్ చేసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. కనుక పూజా కార్యక్రమం పూర్తవగానే అల్లు అర్జున్-అట్లీ ఇద్దరూ రంగంలో దిగిపోవడం ఖాయం.
ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు.