
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘హరిహర వీరమల్లు’ మార్చి 28, మే 9, తర్వాత చివరిగా జూన్ 12కి వాయిదా పడింది. ఈసారి తప్పకుండా జూన్ 12న విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు నమ్మకంగా చెపుతున్నారు.
అది నిరూపించుకోవడానికి అన్నట్లు నేడు హరిహర వీరమల్లు నుంచి ‘అసుర హననం’ అంటూ సాగే ఓ పాట విడుదల చేశారు.
ఇది ఓ యుద్ధ సన్నివేశాన్ని సూచిస్తూ సాగిన పాట కనుక పాట, సంగీతం కాస్త భీభత్సంగానే అనిపిస్తాయి. హరిహర వీరమల్లు గుర్రంపై వేగంగా ఓ కోటలోకి దూసుకువెళ్ళి ప్రజలను పీడిస్తున్న పాలకులను భరతం పట్టినట్లు ఈ పాటలో చూపారు. పాటలో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటులు బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, జాక్విలిన్ ఫెర్నాండస్, అర్జున్ రాంపాల్, విక్రమ్ జీత్, జిష్ణుసేన్ గుప్తా, నోరాహి ఫతేహి, దక్షిణాది నుంచి ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, పూజిత పొన్నాడ తదితరులు ముఖ్య పాత్రలు చేశారు.
హరిహర వీరమల్లుని క్రిష్ దర్శకత్వంలో మొదలుపెట్టగా జ్యోతీ కృష్ణ దర్శకత్వంలో పూర్తి చేస్తున్నారు. ఈ సినిమాకి కధ, దర్శకత్వం, స్క్రీన్ ప్లే: క్రిష్, జ్యోతి కృష్ణ, సంగీతం: ఎంఎం కీరవాణి, పాటలు: స్వర్గీయ సిరివెన్నెల సీతారామ శాస్త్రి, చంద్రబోస్, కెమెరా: జ్ఞానశేఖర్, ఎడిటింగ్: శ్రవణ్, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, శామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యాననర్‌లో ఏఎం రత్నం రూ.150 కోట్ల భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మించిన హరిహర వీరమల్లు జూన్ 12 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.