
అత్యాచారానికి గురైన
మహిళలు ఆ విషయం చెప్పుకోవడానికి సిగ్గుపడి ఆత్మహత్యలు చేసుకొన్నవారు కూడా ఉన్నారు.
కానీ మన నిత్యా మీనన్ తనపై రెండుసార్లు అత్యాచారం జరిగిందని, కానీ తనకి ‘ఆ ఫీలింగే’
కలుగలేదని చెప్పుకొంది. తనపై అత్యాచారం జరిగిన విషయం కూడా తనకి తెలియలేదని మరో గొప్ప
విచిత్రమిన విషయం చెప్పింది. ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఈవిషయం
గొప్పగా చెప్పుకొంది. అయితే అది తన నిజజీవితంలో జరిగినది కాదని తను నటించిన ‘ఘటన’
అనే సినిమాలో జరిగిన ‘రేప్’ అని చెప్పుకొంది.
ఘటన సినిమాలో విలన్
గా నటించిన సీనియర్ నరేష్ తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని (చేసినట్లు
నటించాడని) కానీ దానిని దర్శకురాలు శ్రీప్రియ చాలా సున్నితంగా చిత్రీకరించడంతో
తనకు అత్యాచారానికి గురయ్యాననే ఫీలింగ్ కలుగలేదని నిత్యా మీనన్ చెప్పింది.
కధాపరంగా సినిమాలో
అటువంటి సన్నివేశం ఉండి ఉండవచ్చు కానీ అదేదో చాలా గొప్ప విషయం అన్నట్లు ఒక మహిళ
అయిన నిత్యా మీనన్ గొప్పగా చెప్పుకోవడం, మళ్ళీ తనకి ‘ఆ ఫీలింగ్’ కలుగలేదని టీవీ
స్టూడియోలో కూర్చొని చెప్పుకోవడం సిగ్గు చేటు. అటువంటి కష్టాన్ని ఎదుర్కొన్న ఒక
మహిళ పడే బాధ లేదా ఆవేదన ఏవిధంగా ఉంటుందో వివరించి ఉండి ఉంటే ఎంతో గౌరవంగా,
హుందాగా ఉండేది కానీ తనకి ‘ఆ ఫీలింగ్’ కలుగలేదని నిసిగ్గుగా చెప్పుకొంది.