
‘హనుమాన్’ సినిమాతో తేజా సజ్జా కూడా హనుమంతుడిలాగే పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోయాడు.
ఆ సినిమా తర్వాత కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ‘మిరాయ్’ అనే అడ్వంచర్ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ ముంబయిలోని ప్రసిద్ద ‘ఎలిఫెంటా కేవ్స్’లో ఈ సినిమా తదుపరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించారు.
ఈ సినిమాలో తేజా సజ్జాకి జంటగా రితికా నాయక్ నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఓ కీలక పాత్ర చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ చాలా బారీ బడ్జెట్‌తో 8 భాషల్లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. అదీ.. సాధారణ ‘2డీ’తో పాటు ‘3డీ’లో కూడా నిర్మిస్తున్నారుఈ ఏడాది ఆగస్ట్ 1న మిరాయ్ విడుదలయ్యే అవకాశం ఉంది.