
జూ.ఎన్టీఆర్ తొలిసారిగా బాలీవుడ్లో అడుగుపెట్టి, హృతిక్ రోషన్‌తో కలిసి ‘వార్-2’ అనే పాన్ ఇండియా మూవీ చేశారు. ఆ సినిమా టీజర్ విడుదలైంది. ‘వార్-2’ పేరులోనే వార్ ఉంది కనుక ఇదో యాక్షన్ ప్యాక్ సినిమా అని వేరే చెప్పక్కరలేదు. టీజర్లో అదే చూపారు.
‘వార్-2’ని 5 భాషల్లో తీస్తున్నారు కనుక జూ.ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో విడుదల చేసిన తెలుగు వెర్షన్ టీజర్ చూసి అభిమానులు ఉప్పొంగి పోతున్నారు.
టీజర్లో ‘గెట్ రెడీ ఫర్ వార్’ అంటూ వారిద్దరినీ చూపిన తీరు, యాక్షన్ సన్నివేశాలు చూసి తీరాల్సిందే. టీజరే ఈ రేంజ్లో ఉంటే సినిమా ఏ స్థాయిలో ఉంటుందో ఊహించలేమని అనిపిస్తుంది.
ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న ‘వార్-2'లో కియారా అద్వానీ హీరోయిన్గా నటించింది. ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/9Dve2VMOv5U?si=O23XEj2hfIWPDL3H" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>