మెగాస్టార్ చిరంజీవికి జోడీగా నయనతార కన్ఫర్మ్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తీయబోతున్న సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటించబోతున్నారు. 

ఈ విషయం తెలియజేస్తూ దర్శకుడు అనిల్ రావిపూడి ఆమెతో ఓ కాన్సెప్ట్ వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

నయనతార మేకప్ వేసుకుంటూ తెలుగులో మాట్లాడుతుంటే, ఓ తెలుగు సినిమా చేయబోతున్నారని, కారులో వెళుతున్నప్పుడు మెగాస్టార్ పాట సౌండ్ పెంచమని చెపుతూ చిరంజీవితో నటించబోతున్నట్లు, స్క్రిప్ట్ చదివి నవ్వుతూ ‘వెరీ ఎంటర్‌టైనింగ్’ అంటూ దర్శకుడు అనిల్ రావిపూడి అని సూచించడం చాలా వెరైటీగా ఉంది. 

చివరిగా ఆమె కెమెరా మ్యాన్‌ ఉద్దేశించి ‘హలో  మాస్టర్‌.. కెమెరాని కాస్త రైట్ టర్నింగ్ ఇచ్చుకో’ అంటూ చిరంజీవి పాపులర్ డైలాగ్ చెపుతుంటే అనిల్ రావిపూడి కూడా వస్తారు. ఇద్దరూ కలిసి చిరంజీవి స్టైల్లో ఒక చేత్తో నమస్కరించడం అభిమానులకు చాలా సంతోషం కలిగించేదే.       

ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరు ‘శివశంకర వరప్రసాద్‌’గా నటించబోతున్నారు. విక్టరీ వెంకటేష్‌ అతిధి పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది. 

షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ సినిమాకు కధ, దర్శకత్వం: అనిల్ రావిపూడి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కెమెరా: సమీర్ రెడ్డి, ఎడిటింగ్: తమ్మిరాజు చేస్తున్నారు. 

ఈ సినిమాని 2026 సంక్రాంతి పండుగకి విడుదల చేయబోతున్నట్లు అనిల్ రావిపూడి మరోసారి కన్ఫర్మ్ చేశారు.