
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘అఖండ’ సూపర్ హిట్ అవడంతో దానికి సీక్వెల్‌గా అఖండ-2 తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా 75 శాతం షూటింగ్ పూర్తయింది.
ఈ నెల 21 నుంచి జార్జియాలో అఖండ-2 క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరుగబోతోంది. కనుక త్వరలో బాలకృష్ణతో సహా అఖండ-2లో ముఖ్య పాత్రలు చేస్తున్న వారందరూ వచ్చే వారంలో జార్జియా బయలుదేరబోతున్నారు. అక్కడ సుమారు మూడు వారాలు షూటింగ్ జరుగబోతోందని తెలుస్తోంది. దర్శకుడు బోయపాటి శ్రీను జార్జియాలో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు. కనుక అక్కడ దాని కోసం చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అఖండ-2లో ఆది పినిశెట్టి, సంయుక్త, ప్రగ్యా జైస్వాల్ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: కె. చక్రవర్తి రెడ్డి, డైలాగ్స్: భాను, నందు, సంగీతం: తమన్, కెమెరా: విజయ్ కార్తీక్ కణ్ణన్, ఎడిటింగ్: నిరంజన్ దేవరమనే చేస్తున్నారు.
సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకార స్టూడియోస్ బ్యానర్లపై గోపీ అచంట, రామ్ అచంట, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్వి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నఅఖండ-2 ఈ ఏడాది సెప్టెంబర్ 25న విడుదల కాబోతోంది.