అమెజాన్ ప్రైమ్‌లో అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి

ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రలలో ‘అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలై మిశ్రమ స్పందనతో గట్టెక్కింది. ఈ సినిమాలో విజయశాంతి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌ వైజయంతీగా కళ్యాణ్ రామ్ ఆమె కుమారుడు అర్జున్‌గా నటించారు. 

తల్లీకొడుకుల అనుబంధం, పోలీస్ ఆఫీసరుగా వైజయంతీ, ఆమె శత్రువులను ఎదిరించే కొడుకుగా కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. కానీ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. 

ఇప్పుడు ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌ వీడియోలో ప్రసారం అవుతోంది. పోలీస్ ఆఫీసరుగా విజయశాంతి నటనని మళ్ళీ చూడాలనుకునేవారు ఓటీటీలోకి వచ్చిన ‘అర్జున్‌ సన్ ఆఫ్ వైజయంతి’ని చూసి ఆనందించవచ్చు.