
విజయ్ దేవరకొండ ప్రస్తుతం కింగ్‌డమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తిచేసిన తర్వాత రవి కిరణ్ కోల దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన్’ అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు డా. రాజశేఖర్ విలన్‌గా లేదా ఓ ముఖ్యపాత్రలో నటించబోతున్నారు. ఆ పాత్ర కోసం ఆయనపై స్టూడియోలో ఫోటో ఘాట్ కూడా చేశారు.
ఒకప్పుడు అనేక హిట్స్ కొట్టిన డా. రాజశేఖర్ గత కొన్నేళ్ళుగా చేసిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండటంతో సినిమాలు చేయడం మానుకున్నారు. కనుక మళ్ళీ చాలా కాలం తర్వాత రౌడీ జనార్ధన్‌తో కలిసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన అభిమానులకు ఇది చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడీగా కీర్తి సురేష్ నటించబోతున్నారు.
ప్రస్తుతం ‘రౌడీ జనార్ధన్’ ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమా ఎస్‌వీసి59 వర్కింగ్ టైటిల్‌తో ప్రకటించినప్పుడు విడుదల చేసిన పోస్టర్లో “కత్తి నేనే, నెత్తురు నాదే, యుద్ధం నాతోనే’ అంటూ ఈ సినిమా చాలా సీరియస్ మ్యాటర్ అని చెప్పకనే చెప్పారు.
ఈ సినిమాని దిల్‌రాజు తన సొంత బ్యానర్ శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించబోతున్నారు.