
కుటుంబ సమస్యల కారణంగా చాలా ఏళ్ళు సినిమాలు చేయలేకపోయిన మంచు మనోజ్, మళ్ళీ లైన్లో పడినట్లే ఉన్నారు.
యువ నటులు బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌లతో కలిసి మంచు మనోజ్ చేసిన ‘భైరవం’ మే 30న విడుదల కాబోతోంది.
తాజాగా శేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. శేఖర్ రెడ్డి 90 ఎంఎల్ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ సినిమాకి ‘అత్తరు సాయిబు’ అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 20న పూజా కార్యక్రమం నిర్వహించి, జూన్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు. అత్తరు సాయిబు టైటిల్‌ని బట్టి చూస్తే ఈ సినిమా కామెడీ, మాస్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ అనిపిస్తుంది, త్వరలోనే ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, పనిచేయబోయే సానికేతిక నిపుణుల వివరాలు ప్రకటించనున్నారు.