సంబంధిత వార్తలు

నందమూరి కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్‌లో ప్రవేశించబోతున్నాడు. స్వర్గీయ నందమూరి హరికృష్ణ కుమారుడు స్వర్గీయ జానకీరామ్. ఆయన కుమారు నందమూరి తారక రామారావుని ప్రముఖ దర్శకుడు వైవీస్ చౌదరి హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో వీణా రావు అనే కొత్త అమ్మాయిని కూడా హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నారు.
‘న్యూ టాలెంట్ రోర్స్’ బ్యానర్‌పై యలమంచిలి గీత ప్రొడక్షన్ నం.1గా నిర్మించబోతున్న ఈ సినిమాకి ఈ నెల 12న హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఈ సినిమాకు సంగీతం: కీరవాణి, పాటలు: చంద్రబోస్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర చేస్తారు.