
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం చేస్తున్న గురు సినిమా రిలీజ్ డేట్ కన్ఫాం చేశారు దర్శక నిర్మాతలు. రీసెంట్ గా బాబు బంగారంతో తన మార్క్ హిట్ అందుకున్న వెంకీ హింది, తమిళంలో హిట్ అందుకున్న సాలా ఖదూస్ రీమేక్ తో 'గురు'గా వస్తున్నాడు. ఆల్రెడీ కంప్లీట్ కావొచ్చిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దించాలని ప్రయత్నాలు చేసినా అప్పటికన్నా సోలోగా జనవరి 26న రిలీజ్ చేస్తే బెటర్ అని రిలీజ్ అప్పటికి డిసైడ్ చేశారట.
మాత్రుక దర్శకురాలు సుధ కొంగర డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కోచ్ గా వెంకటేష్ చేస్తుండగా బాక్సర్ గా రితీకా సింగ్ నటిస్తుంది. ఒరిజినల్ వర్షన్లో కూడా ఆ క్యారక్టర్ ఆమె చేసింది. ఫస్ట్ లుక్ తో అంచనాలు ఏర్పడేలా చేసిన వెంకటేష్ ఈసారి మళ్లీ ఓ సూపర్ హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. రిపబ్లిక్ డే టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా వెంకటేష్ కు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. గురు రిలీజ్ అయిన తర్వాత వెంటనే కిశోర్ తిరుమలతో ఆడావాళ్లు మీకు జోహాలు సినిమా రంగం సిద్ధం చేస్తున్నాడు వెంకటేష్.