
ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ అంటూ ఏదో ఓ భాషకే పరిమితమవుతూ సినిమాలు తీయడంలేదు. ఏ భాషలో తీస్తున్న వేరే భాషలలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. హిందీలో తీసిన చావా సినిమా దక్షిణాది భాషలో విడుదల చేయడం ఇందుకు తాజా ఉదాహరణ.
కనుక విజయ్ సేతుపతి-నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న తమిళ సినిమా కూడా తెలుగులో వస్తుంది. కనుక ఆ సినిమా గురించి తెలుసుకోవచ్చు. ఈ సినిమాకు తలైవన్, తలైవి అని టైటిల్ ఫిక్స్ చేసి టైటిల్ టీజర్ విడుదల చేశారు. తలైవన్ అంటే తెలుగులో నాయకుడు. తలైవి అంటే నాయకురాలు. కనుక దీని డబ్బింగ్ వెర్షన్ నాయక-నాయికి అని పెడతారేమో? లేదా ఇప్పుడు తమిళ టైటిల్స్‌తోనే తెలుగులో విడుదల చేసేస్తున్నారు కనుక అదె పేరుతో విడుదల చేసినా ఆశ్చర్యం లేదు.
ఈ సినిమాకు సంగీతం: సంతోష్ నారాయణన్, కొరియోగ్రఫీ: బాబా భాస్కర్, కెమెరా: ఎం.సాయి కుమార్, స్టంట్స్: కలై కింగ్‌స్టన్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, ఆర్ట్: కె. వీరసమార్ చేస్తున్నారు.
సత్యజీవతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు.