విశ్వంభరలో త్రిష ఫస్ట్-లుక్‌

మల్లాది వశిష్ట దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, త్రిష జంటగా చేస్తున్న ‘విశ్వంభర’ సోషియో ఫాంటసీ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇవాళ్ళ (మే 4) త్రిష పుట్టిన రోజు సందర్భంగా విశ్వంభర నుంచి ఆమె ఫస్ట్-లుక్‌ విడుదల చేశారు.

ఈ సినిమాలో త్రిష పాత్ర పేరు అవని. చక్కటి చీర కట్టుతో త్రిష చాలా నిండుగా ఉన్నారు. విశ్వంభరలో కునాల్ కపూర్, ఆషికా రంగనాధ్ ముఖ్యపాత్రలు చేస్తున్నారు.   

కళ్యాణ్ రామ్‌కి బింబిసార వంటి సూపర్ హిట్ ఇచ్చిన మల్లాది వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో ఈ సినిమాపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. జనవరిలో సంక్రాంతి పండుగకు విశ్వంభర విడుదల కావలసి ఉండగా గేమ్ చేంజర్‌ కోసం మే 9కి వాయిదా వేశారు. కానీ జూలై 24 కి వాయిదా పడింది. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మల్లాది వశిష్ట, డైలాగ్స్: సాయి మోహన్ బుర్రా, సంగీతం: కీరవాణి, కెమెరా: మ్యాన్ ఛోటా కె నాయుడు, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు. 

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి కలిసి రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో విశ్వంభరని పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో తెరకెక్కిస్తున్నారు.