సైంధవ్ రుణం తీర్చుకోవాలలి: శైలేష్ కొలను

విక్టరీ వెంకటేష్‌ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోవలసిన 75వ సినిమా ‘సైంధవ్’ నిరాశ పరిచినందుకు ఆయనేమీ బాధ పడలేదు కానీ ఆ సినిమాకి దర్శకత్వం వహించిన శైలేష్ కొలను చాలా బాధ పడ్డారు. అటువంటి పెద్ద స్టార్‌కి తన వల్ల ఓ ఫ్లాప్ పడిందని బాధపడుతుంటే, వెంకటేషే తనకు ఓ గురువుగారిలా ధైర్యం చెప్పారని శైలేష్ కొలను చెప్పారు. ఆ రోజు ఆయన తనకు అండగా నిలబడక పోయుంటే  ఆ ప్రభావం తన హిట్-3 మీద కూడా పడి ఉండేదేమోనన్నారు. కనుక వెంకటేష్‌ మరో అవకాశం ఇస్తే ఆయనతో ఓ చక్కటి ఫ్యామిలీ కామెడీ సినిమా తీసి హిట్ ఇచ్చి రుణం తీర్చుకోవాలని అనుకుంటున్నానని శైలేష్ కొలను అన్నారు. వెంకటేష్‌ స్టైల్, కామెడీ టైమింగ్‌కు తగ్గట్లుగా కధ సిద్దం చేస్తానని శైలేష్ కొలను చెప్పారు. మరి ‘సంక్రాంతికి వస్తున్నాం’తో హిట్ కొట్టి దాని సీక్వెల్‌ చేసేందుకు సిద్దమవుతున్న వెంకటేష్‌, శైలేష్ కొలనుకి ఎప్పుడు అవకాశం ఇస్తారో?